హైదరాబాద్: 28°C
క్రీడలు

'ఐపీఎల్‌ కీలకమే.. కానీ టెస్టులకే తొలి ప్రాధాన్యం'

టెస్టు క్రికెట్‌కే ఆటగాళ్లు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని భారత మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ అన్నాడు. ఐపీఎల్ లాంటి టీ20 టోర్నీలు ముఖ్యమే అయినప్పటికీ, ఒక క్రికెటర్ నిజమైన ప్రతిభను అంచనా వేయడానికి టెస్టు క్రికెట్టే అసలైన కొలమానమని తెలిపాడు. టీ20లకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో, టెస్టు మ్యాచ్‌లను కూడా ఎక్కువగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని శ్రీనాథ్ సూచించాడు.