ATP: శెట్టూర్ ఎస్సీ హాస్టల్ కాంపౌండ్ వాల్ కూలి గాయపడిన విద్యార్థి అక్షయ్‌ను అనంతపురం జీజీహెచ్‌లో మాజీ ఎంపీ తలారి రంగయ్య గురువారం పరామర్శించారు. అక్షయ్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. విద్యార్థికి ఆర్థిక సహాయం అందించి, అన్నివేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. హాస్టల్ భవనాల భద్రతపై అధికారులు శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
గాయపడిన విద్యార్థికి తలారి రంగయ్య పరామర్శ


