సత్యసాయి: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని MLA కందికుంట వెంకట ప్రసాద్ కోరారు. రైతులు కొత్త బోరుబావులు వేయడాన్ని తగ్గించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హంద్రీ–నీవా ద్వారా చెర్లోపల్లి రిజర్వాయర్‌కు నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తాగునీరు, సాగునీటి సమస్య రాకుండా చూస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పొదుపుగా నీటిని వినియోగించాలి: ఎమ్మెల్యే


