HNK: కాజీపేట మండలం మడికొండలోని శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో సత్యనారాయణ, కమిటీ ఛైర్మన్ పైడిపాల రఘు చందర్, అర్చకులు, ధర్మకర్తల సమక్షంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించినట్లు గురువారం భక్తులు తెలిపారు. ఆలయ పూజారి పైడిపాల సురేష్ అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
అమ్మవారికి తొలి బోనం సమర్పణ


