మెదక్ జిల్లా కోనాపూర్‌లో యూరియా సకాలంలో అందక, ఆన్‌లైన్ సర్వర్ పనిచేయక విసిగిపోయిన రైతులు రహదారిపైకి ఎక్కారు. మెదక్-వెల్కటూర్ (765D) ప్రధాన రహదారిపై అర్ధగంట పాటు బైఠాయించి నిరసన తెలిపారు. రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో రామాయంపేట పోలీసులు రంగంలోకి దిగారు. యూరియా సరఫరా అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.
తెలంగాణ
యూరియా దొరక్క రోడ్డెక్కిన కోనాపూర్ రైతులు


