హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాడి కౌశిక్ రెడ్డికి 'ఎథిక్స్ కమిటీ' నోటీసులు

HYD: హుజూరాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డికి 'ఎథిక్స్ కమిటీ' నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 29న జరిగిన శాసనసభ సమావేశాల్లో సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుపై ఎథిక్స్ కమిటీ దృష్టి సారించింది. ఈనెల 29న అసెంబ్లీ కమిటీ హాల్-1లో ఉదయం 11 గంటలకు ఎథిక్స్ కమిటీ భేటీ కానుంది. కౌశిక్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై కమిటీ విచారించనుంది.