ASF: తిర్యాణి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం భీంపూర్ కు చెందిన భీంరావు మండల కేంద్రంలోని చికెన్ సెంటర్ లో పనిచేస్తున్నాడు. రాత్రి విధులు ముగించుకుని బైకుపై ఇంటికి వెళ్తుండగా చేలిమెల సమీపంలోని లో- లెవెల్ వంతెన వద్ద బైకు అదుపుతప్పింది. ఈ ఘటనలో భీంరావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రి తరలించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు


