హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మొలకెత్తిన గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు

రోజూ గుప్పెడు మొలకెత్తిన గింజలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు (A, C, E).. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. గుండె జబ్బులను నివారించి, బరువు తగ్గడంలో సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా శక్తి లభిస్తుంది.