హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోజుకో దానిమ్మ తింటే..!

దానిమ్మ పండులో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచే గుణాలున్నాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే దానిమ్మ చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. రోజూ ఒక దానిమ్మ పండు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది.