హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు ఆటంకం

MNCL: జైపూర్ మండలంలో గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. మంచిర్యాల 132 కేవీ సబ్‌ స్టేషన్‌లో మరమ్మతు పనుల కారణంగా జైపూర్, ఇందారం, కుందారం, పౌనూర్ పరిధిలోని గ్రామాలలో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.