హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజాసేవలో డా. చల్మారెడ్డి సేవలు మరువలేనివి: MLA

WNP: డాక్టర్ చల్మారెడ్డి మృతి వనపర్తి ప్రాంతానికి, వైద్య రంగానికి తీరని లోటని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. గురువారం ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైద్య సేవలను ప్రజాసేవగా భావించి అందరికీ సమానంగా సేవలందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన సేవా స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.