భద్రాద్రి: చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గురువారం ప్రాజెక్టులోని 25 క్రస్ట్ గేట్లలో 12 గేట్లను రెండేసి అడుగుల మేర ఎత్తి ఉంచి వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 16,234 క్యూసెక్కుల చొప్పున వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద


