వికారాబాద్ పరిధిలోని వెంకటాపూర్ తండాకు వెళ్లే రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. వర్షం పడితే వాటిలో నీరు నిండడంతో ఎక్కడ గుంత ఉందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా వాహనదారులు ఆమార్గంలో వెళ్లడానికి భయపడుతున్నారు. గతంలో పలుమార్లు ఈ రోడ్డుపై వాహనాలు జారిక్రింద పడిన ఘటనలు ఉన్నాయని, అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
గుంతలమయంగా రహదారి


