హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. చిన్నారి మృతి'

భద్రాద్రి: కొత్తగూడెం పట్టణంలోని రామవరం మాతా శిశు కేంద్రంలో బుధవారం రాత్రి 26 నెలల చిన్నారి మృతి చెందింది. ములకలపల్లికి చెందిన విజయలక్ష్మికి పుట్టిన పాపకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో కుటుంబసభ్యులు మాతా శిశు కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.