E.G: గోకవరం మండలంలోని 14 గ్రామ పంచాయతీల పరిధిలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక ఖరీఫ్ వరి సాగు తీవ్రంగా మందగించింది. బోర్లు, చెరువుల ఆయకట్టు కింద ఇప్పటివరకు 30 శాతం కూడా నాట్లు పూర్తికాలేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతుండగా, వరికి బదులు మినుములు, పెసలు, కంది, జొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎల్‌నినో ప్రభావం....30 శాతం మించని వరి నాట్లు


