ADB: తాంసి మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టు నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోందని AEE హరీశ్ తెలిపారు. గురువారం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 277.50 మీటర్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం అదే స్థాయిలో నీటిమట్టం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టులోకి 40 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే మొత్తంలో నీటిని బయటకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
మత్తడి వాగు ప్రాజెక్టు తాజా నీటి వివరాలు


