MDK: చిన్నశంకరంపేట మండలంలోని చందాపూర్, మల్లుపల్లి గ్రామ శివారు వ్యవసాయ పొలాల్లో నెమలి పురివిప్పి నాట్యం చేస్తూ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయాన్నే పొలాల వైపు వెళ్తున్న రైతులు, స్థానికులు ఈ మనోహరమైన దృశ్యాన్ని తిలకించి మురిసిపోయారు. నెమలి పురివిప్పి చేసిన నాట్యాన్ని చూసి గ్రామస్థులు, వాహనదారులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ
చందాపూర్ శివారుల్లో పురివిప్పిన నెమలి


