VKB: కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో కొత్త బస్టాండు నిర్మించాలని రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్నదాన్ని కూల్చి ఆధునిక హంగులతో నిర్మించనున్నారు. ఇందులో భాగంగా ఉన్నతాధికారులు ఇటీవల కొడంగల్‌కు వచ్చి పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న బస్టాండును 1981లో నిర్మించారు. కొత్తగా నిర్మించే దానిలో సిబ్బంది ఉండడానికి విశ్రాంతి గదులు నిర్మించే అవకాశం ఉంది.
తెలంగాణ
కొడంగల్‌కు కొత్త బస్టాండు.!


