హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూతురు సూసైడ్.. తెలిసి తండ్రి ఆత్మహత్య

MDK: తూప్రాన్‌లోని యావపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొత్త రాములు(50) మొదటి భార్య మృతిచెందడంతో ఆమె సోదరిని రెండో వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా తల్లి మతిస్థిమితం లేకపోవడంతో అనంతగిరిపల్లిలోని తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. మనస్థాపంతో ఇంటర్‌ చదువుతున్న కుమార్తె(16) ఉరేసుకుని మృతిచెందింది. విషయం తెలిసిన రాములు కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.