MLG: ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ ప్రజల సౌకర్యార్థం బుధవారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు తమ సొంత నిధులతో ఫ్రీజర్ బాక్స్‌ను విరాళంగా అందించారు. అత్యవసర సమయాల్లో గ్రామ ప్రజలకు ఉపయోగపడేలా ఈ సదుపాయం కల్పించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సేవా నిరతికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రజల సౌకర్యార్థం ఫ్రీజర్ బాక్స్ విరాళం


