హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల దాడిని ఖండించిన బీఎస్పీ

NGKL: తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్‌లో పాలమూరు మహేందర్‌పై జరిగిన దాడిని బీఎస్పీ తీవ్రంగా ఖండించింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని నాయకులు పరామర్శించారు. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఎంక్వైరీ కోసం పిలిచి దాడి చేశారని ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.