నారాయణపేట జిల్లా సైకిల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు ఈనెల 30న నారాయణపేట జిల్లా మక్తల్ ఎల్లమ్మ కుంటలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి సైకిల్ పోటీలు నిర్వహించనున్నారు. ప్రధాన కార్యదర్శి గోపాలం ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో 8-11 ఏళ్ల బాలబాలికలు పాల్గొనవచ్చు. ఎంపికైన వారికి సెప్టెంబర్ 12,13న హైదరాబాద్ బండ్లగూడలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో అవకాశం లభిస్తుంది.
తెలంగాణ
మక్తల్‌లో జిల్లా స్థాయి సైకిల్ పోటీలు


