JN: జిల్లాలోని కురుమవాడ వాటర్ ట్యాంక్ సమీపంలో గురువారం తెల్లవారుజామున 3 గంటలకు మూడు ట్రాలీ ఆటోల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మూడు ఆటోలు పూర్తిగా దగ్ధమై ఆస్తినష్టం జరిగింది. మంటలు ఎలా అంటుకున్నాయనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.
తెలంగాణ
జనగామలో మూడు ట్రాలీ ఆటోలు దగ్ధం


