హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెంకటేశ్వర స్వామికి కళాశాలతో అభిషేకం

KNR: జమ్మికుంటలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని 108 కలశాలతో స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. ప్రధాన అర్చకులు హరికృష్ణ ఆచార్యులు వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం కలశాలతో ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి పుష్కలంగా వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థించారు.