హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలి'

NRML: సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని చెన్నూర్ కోర్ట్ మెజిస్ట్రేట్ పర్వతపు రవి ప్రకటనలో కోరారు. లోక్ అదాలత్ ద్వారా ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ ఉన్న కేసులను గుర్తించి, సంబంధిత పక్షాలతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి కృషి చేయాలని న్యాయవాదులకు సూచించారు.