హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగుల పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

ADB: ప్రభుత్వం అందించే చేయూత దివ్యాంగుల పింఛన్ల కోసం అర్హులైన వారు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని వికలాంగుల జిల్లా కమిటీ సభ్యుడు సలావుద్దీన్ బుధవారం తెలిపారు. దరఖాస్తుతో పాటు తప్పనిసరిగా సదరం ధ్రువీకరణ పత్రం సమర్పించాలని ఆయన సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.