హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

NLG: దామచర్ల మండల పరిధిలోని ఐలాపురం గ్రామానికి చెందిన నూనావత్ విజయ నాగ నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ హాజరయ్యారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.