HNK: ఐనవోలు మండలం పున్నేలు క్రాస్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వరంగల్ రంగశాయిపేటకు చెందిన మచ్చ కుమారస్వామి (50) మృతి చెందారు. ఉప్పరపల్లిలో బంధువుల శుభకార్యానికి హాజరై ద్విచక్రవాహనంపై ఇంటికి తిరుగు ప్రయాణంలో ఉండగా వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలో కుమారస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్..!


