ASF: దహెగం మండలం కమ్మర్ పల్లి గ్రామపంచాయతీ మర్రిపల్లిలో పోలీసులు బుధవారం సాయంత్రం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఇద్దరి నుంచి 8 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని, 900 లీటర్ల బెల్లం పానకం (వాష్) ధ్వంసం చేశారు. అనంతరం గ్రామస్థులకు సైబర్ నేరాలు, గంజాయి, డయల్ 112, మోటారు వాహన చట్ట నిబంధనలు, సామాజిక దురాచారాలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
మర్రిపల్లిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్..!


