హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామాయంపేటలో నేడు యూరియా పంపిణీ.

MDK: రామాయంపేట మండల పరిధిలో గురువారం రైతులకు యూరియా అందుబాటులో ఉంటుందని ఏఓ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. పీఏసీఎస్ పరిధిలోని అక్కన్నపేట, కాట్రియాల, కోనాపూర్ గ్రామాల్లో ఉదయం 9 గంటలకు ఎరువులు అందుబాటులోకి వస్తాయన్నారు. రైతులు ముందస్తుగా ఆన్‌లైన్ ద్వారా అవసరమైన మేరకే బుక్ చేసుకోవాలని, ఎరువుల కొరత లేకుండా చూస్తామని అధికారులు సూచించారు.