హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగారెడ్డిలో వర్షపాతం వివరాలు

సంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా పటాన్‌చెరు తహసీల్దార్ కార్యాలయం వద్ద 15.5 మి.మీ, కంది, మొగ్డంపల్లిలో 12.5 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. ఆర్‌సి పురంలో 12.3, కంగ్టిలో 11.5, రుద్రారంలో 10.5 మి.మీ మేర వర్షం పడింది. జిల్లావ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28°C నుండి 31°C వరకు నమోదైనట్లు అధికారులు తెలిపారు.