హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

SDPT: జిల్లాలోని అర్హులైన నిరుపేదలు ఆగస్టు 31వ తేదీలోగా చేయూత పింఛన్లకు అప్లై చేసుకోవాలని నంగునూరు, ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత-చేనేత కార్మికులు, తలసేమియా, ఫైలేరియా బాధితులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరారు. అవసరమైన పత్రాలను జతచేసి స్థానిక జీపీ లేదా ఎంపీడీవో ఆఫీస్‌లో వెంటనే దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.