హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పేదలకు భూదాన్‌ భూములు ఇవ్వాలి'

సంగారెడ్డి జిల్లాలోని భూదాన్ భూములను అర్హులైన నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని బీఎస్పీ నాయకుడు మోహన్ డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో భూదాన్ బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్‌కు వినతిపత్రం అందించారు. దళితులకు భూమి ఇస్తామని గత ప్రభుత్వాలు దగా చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి లేని పేదలందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.