హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి!

WNP: యూఫపెద్దమందడి మండలం వెల్టూరు స్టేజీ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన రవీందర్‌గౌడ్ (45) మృతి చెందాడు. బంధువు అంత్యక్రియలకు వచ్చి తిరుగు ప్రయాణమైన ఆయనను ఒక వాహనం ఢీకొట్టింది. ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ లభించలేదని, బలీదుపల్లి సర్పంచ్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.