హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యల పరిష్కారానికి ఎంపీకి వినతి

GDWL: అలంపూర్ పట్టణంలోని 5వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్ జమ్మన్న కోరారు. బుధవారం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఎంపీ మల్లు రవికి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కాలనీలో కందకం వెనుక ఖాళీ స్థలాన్ని అభివృద్ధి చేసి మినీ పార్కుగా ఏర్పాటు చేయాలని కోరారు. మురుగునీరు నిల్వ ఉండకుండా సైడ్ కాలువలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.