హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చేయూత పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి'

మెదక్ జిల్లాలో చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు అర్హులైన వారు ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. అర్హులెవరూ పథక ప్రయోజనానికి దూరం కాకుండా ప్రభుత్వం విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతోందన్నారు. సెర్చ్ ఆధ్వర్యంలో తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ఆడియోలు, వీడియోలు, పాటల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.