తెలంగాణ
మల్లన్నగండిలో విషాదం: ఈతకెళ్లి యువకుడు మృతి
స్టేషన్ ఘన్పూర్ సమీపంలోని మల్లన్నగండి రిజర్వాయర్ వద్ద శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. శామీర్పేటకు చెందిన ముప్పై మంది యువకులు సరదాగా విహారయాత్రకు వెళ్లగా, వారిలో దేవరుప్పుల మండలానికి చెందిన ఒక యువకుడు ఈత కోసం నీటిలోకి దిగాడు. అయితే, అధిక లోతు, వాటర్ ఫాల్స్ వద్ద పాకురు ఉండటంతో కాలుజారి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు


