హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

MLG: తాడ్వాయి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.83 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క బుధవారం శంకుస్థాపన చేశారు. మార్కెట్ యార్డుల అభివృద్ధికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.3కోట్లు మంజూరు చేయగా, అందులో భాగంగా ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.