హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో గంజాయి విక్రయిస్తున్న రామోజి రాజేష్ (23)పై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్.రమేష్ తెలిపారు. హిమజ జువెలరీ షాప్ నిర్వహిస్తున్న రాజేష్ చెడు వ్యసనాలకు అలవాటుపడి, స్నేహితుడి వద్ద గంజాయి కొని వాడగా మిగిలినది అధిక ధరకు అమ్ముతున్నాడని తెలిపారు. సమాచారంతో దుకాణం వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు.