హైదరాబాద్: 28°C
తెలంగాణ

108 కలశాలతో స్వామివారికి అభిషేకం

KNR: జమ్మికుంటలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 కలశాలతో స్వామివారికి అభిషేకం చేయగా, ప్రధాన అర్చకులు డింగరి హరికృష్ణ ఆచార్యులు వేదమంత్రాలతో పూజలు చేశారు. అనంతరం కలశాలతో ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు చేపట్టారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.