హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముసాయిదా ఓటర్ జాబితాపై రేపు గ్రామసభలు

MNCL: లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో సర్ ఓటరు ముసాయిదాపై గ్రామ సభలు నిర్వహించనున్నామని తహసీల్దార్ దిలీప్ కుమార్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో ఇటీవల ముసాయిదా ఓటర్ జాబితా రూపొందించడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి అన్ని పంచాయతీలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సమక్షంలో గ్రామ సభను ఏర్పాటు చేసామన్నారు.