GDWL: ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రానికి బుధవారం భక్తులు, పర్యాటకుల తాకిడి పెరిగింది. శ్రీ అభయాంజనేయస్వామి, శ్రీ కోదండ రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కృష్ణానది తీర అందాలను తిలకిస్తూ.. మొబైల్ ఫోన్లతో సెల్ఫీలు దిగారు. నదీ తీరంలో పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలని పలువురు సూచించారు.
తెలంగాణ
బీచుపల్లికి పెరిగిన భక్తుల తాకిడి


