హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు బాపట్లలో కరెంట్ బంద్

బాపట్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ సాయి శ్రీనివాస్ తెలిపారు. పటేల్ నగర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ లైన్లు, వెంగల్ విహార్ మరియు రాణి కాలనీ పరిసరాల్లో విద్యుత్ వైర్ల మార్పిడి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. అందువల్ల ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.