హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో '30 పోలీస్ యాక్ట్' అమలు

ATP: శాంతిభద్రతల పరిరక్షణకు అనంతపురం అర్బన్ పరిధిలో నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని డీఎస్పీ ఎం. చంద్రశేఖర్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, ధర్నాలు, మైకుల వినియోగం చేపట్టరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు, ప్రజాసంఘాలు సహకరించాలని కోరారు.