E.G: ఆగస్టు 5వ తేదీన అయ్యప్ప స్వామి మాల దీక్షను స్వీకరించిన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం నియమనిష్టలతో దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ద్వారపూడిలోని అయ్యప్ప స్వామి దేవాలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని, నియోజకవర్గ ప్రజలందరిపై అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
దీక్ష విరమించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి


