హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మంటల్లో ఇల్లు దగ్ధం.. అండగా యూట్యూబర్

KKD: తుని పట్టణం కొండవారిపేటలో బుధవారం దోమల చక్రం వల్ల సంభవించిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన ఆరుగుల చిన్ని కుటుంబానికి స్థానిక యువత అండగా నిలిచారు. యూట్యూబర్ దుర్గాప్రసాద్ తన స్నేహితులు దుర్గా, శివాజీలతో కలిసి బాధిత కుటుంబానికి బియ్యం బస్తా, 15 రోజులకు సరిపడా నిత్యావసర సరకులు, కూరగాయలతో పాటు దుస్తులను అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.