కోనసీమ: జిల్లాకు చెందిన మత్స్యకారులు క్షేమంగా ఉన్నారన్న సమాచారం అందడంతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హర్షం వ్యక్తం చేశారు. అల్లవరం మండలం ఓడలరేవు నుంచి ఈ నెల 3వ తేదీన వేటకు వెళ్లి గల్లంతైన బోటు ఆచూకీ లభించడంతో పాటు, అందులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడిశాలోని పారాదీప్ తీరానికి చేరుకున్నారని అధికారులు ధృవీకరించారన్నారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్యకారుల క్షేమ సమాచారంతో మంత్రి హర్షం


