ప్రకాశం: కొమరోలు మండలం తాటిచెర్లలో ఉద్యానశాఖ డైరెక్టర్ డా. కె. శ్రీనివాసులు బుధవారం ఉద్యాన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వీడ్ మ్యాట్ వినియోగం, ఫార్మ్ పాండ్ల ఏర్పాటు, నీటి సంరక్షణ, అంతర పంటల సాగుపై సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి పి. జానమ్మతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యాన పంటల క్షేత్రాల పరిశీలన


