హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ నేత ఇంట్లో ఎంపీ రఘునందన్

సిద్దిపేట్ పట్టణంలోని 31వ బూత్ అధ్యక్షుడు మిద్దె చందు ఇటీవలే మృతిచెందగా, ఆయన కుటుంబ సభ్యులను మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు పరామర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్‌తో కలిసి చందు నివాసానికి వెళ్లిన ఎంపీ.. వారి కుటుంబాన్ని ఓదార్చి గాఢ సానుభూతి తెలిపారు. పార్టీ ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.