హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎత్తిపోతల పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

BDK: అశ్వాపురం మండలం మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుది దశకు చేరుకున్న పనులను వేగంగా పూర్తి చేసి నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ నెలాఖరులోగా రైతులకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.